'ముత్యం' తయారీ గురించి మీరు విన్నది తప్పు, అసలు కథ వేరే

updated: March 16, 2018 21:52 IST

వాడు స్వాతి ముత్యం అండీ అని కాస్త అమాయకంగా మంచిగా ఉండే వాడిని పిలుస్తూంటాం. అలాగే జ్యోతిష్యుడు దగ్గర కి వెళ్తే మన నక్షత్రాన్ని బట్టి ముత్యాన్ని వెండి ఉంగరంలో కలిపి పెట్టుకునే మంచిదని చెప్తూంటారు. ముత్యాల పూసలు దండలు మన ఆడవాళ్లు ఎంతో ఇష్టపడుతూంటారు.  ఈ ముత్యాలు ..సముద్రంలో ఉన్న ముత్యపు చిప్పలో ఓ స్వాతి చినుకు వచ్చి పడితే అది ముత్యంగా మారుతుందని మనం కథ వింటూంటాం. అయితే నిజానికి ముత్యం తయారయ్యే విధానం వేరే.

అయితే  సహజంగా బుల్లి ముత్యం తయారవ్వాలంటే రెండు, మూడేళ్లు పడుతుంది.  పది వేల ఆల్చిప్పల్లో ఒకటి, రెండింటిలోనే ముత్యాలు ఏర్పడతాయి. ఈ నేపధ్యంలో ముత్యాలు ఎన్నో దొరకవు. ముత్యాలు ఒకప్పుడు ధనికులకు మాత్రమే పరిమితమైన సంపద. కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ కూడా ముత్యాల దండలతో మెరిసిపోతోంది. అందుకు కారణం ...ముత్యాలు సాగు మాత్రమే.  ఇదో పంటలా సాగు చేయటం వల్ల ముత్యాలు అందరికీ లభ్యమవుతున్నాయి. ఇంతకీ ముత్యాల సాగు ఎలా చేస్తారంటారా..ఇదో ఇంట్రస్టింగ్ స్టోరీ. 

 

వాస్తవానికి వందేళ్ల క్రితం దాకా ఈ కృత్రిమ ముత్యాలు గురించి ఎవరికీ తెలియలేదు. అయితే కృ త్రిమ ముత్యాలను ప్రపంచమంతా వెదజల్లిన క్రెడిట్ మాత్రం  మికీమోటో అనే జపాన్ దేశస్థుడు కే చెందుతుంది.  ముత్యం తయారయ్యే సృష్టి విచి త్రాన్ని కనుక్కున్నాడు ఆయన. 

ముత్యపు పురుగు దేహం(ఓయెస్టర్)లోకి ఒక ఇసుక కణం ప్రమాదవశాత్తూ లోనికి ప్రవేశించి దానికి చాలా బాధ కలిగించడం, ఆబాధానివారణ కోసం ముత్యపు పురుగు కాల్షియం కార్బొనేట్ అనేక వేల పల్చని పొరలుగా ఈ సూక్ష్మకణం చుట్టూ స్రవింపచేయడం, ఈ పొరలు ఘనీభవించి ముత్యంగా రూపొందే సృష్టి విచి త్రాన్ని పరిశోధనలు చేసి కనుక్కున్నాడు. 

ఒక చిన్న ముత్యపు పురుగు తన ఆవేదనను  ఇలా  ఒక ముత్యంగా మార్చడం అతనికి ఎంతో అబ్బురంగా అనిపించింది. మికీమోటోకు ముత్యాల రహస్యం తెలిసిపోవంటంతో.. ముత్యపు పురుగులతో కృ త్రిమంగా ముత్యాల సాగు మొదలు పెట్టాడు. 

ఏంటి తేడా అంటే..

సహజంగా తయారయ్యే ముత్యానికి, సాగు ముత్యాలకు ఒకటే తేడా. అసలు ముత్యంలో కేం ద్రకణం స్వాభావికంగా ముత్యపు పురుగు దేహంలో ప్రవేశిస్తుంది. కృ త్రిమ ముత్యంలో కేం ద్రకణం కృ త్రిమంగా ఉంచబడుతుంది. 

comments